తొలిప్రేమ సినిమాలో ఈ భామ అవకాశం పోగొట్టుకోవడానికి కారణం ఎవరో తెలుసా ?
Varun Tej Tholi Prema Movie :హీరోయిన్ మెహ్రీన్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అల్లరిపిల్లగా నటించి బాగా గుర్తింపు పొందటమే కాకుండా వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తర్వాత రాజా ది గ్రేట్, మహానుభావుడు వంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘జవాన్’ సినిమా తీవ్ర నిరాశ పరచింది.
అయితే ఆమె ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. అది ఆమె బరువు కారణంగా. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి మొదటగా ఈ సినిమా కోసం మెహ్రీన్ ని సంప్రదించాడట. కానీ ఆమె కాస్త బొద్దుగా కనపడటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం.
వరుసగా ఆఫర్ లు వస్తున్నా కూడా ఈ అమ్మడు ఫిజిక్ పై దృష్టి పెట్టకపోవడంతో తొలిప్రేమ అవకాశాన్ని పోగొట్టుకుంది.’తొలిప్రేమ’ సినిమా హిట్ కావటంతో కాస్త జ్ఞానోదయం అయ్యి జిమ్ లో వర్క్ అవుట్స్ చేసి నాజూగ్గా మారింది. . అంతేకాక ఆమె లావు కారణంగా ఏ సినిమాని కూడా మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయింది మెహ్రీన్.