Healthhealth tips in telugu

ఇలా చేస్తే చాలు 2 నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పి మాయం అయ్యి జీవితంలో ఉండదు

Migraine Headache Home Remedies : మామూలుగా వచ్చే తలనొప్పిని కాస్త అశ్రద్ద చేసినా కానీ మైగ్రైన్ తలనొప్పిని అసలు అశ్రద్ద చేయకూడదు. మైగ్రైన్ తలనొప్పి ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే మైగ్రేన్‌ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఒక వైపు మాత్రమే వేధిస్తుంది. కాబట్టి పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. .

తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువగా మైగ్రైన్ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పిని అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడాలి. మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
Ginger benefits in telugu
చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసం ఒక స్పూన్ ఉండేలా చూసుకోవాలి. ఈ రసంలో 5 మిరియాలను పొడిగా చేసి కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం మొత్తంను ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే క్రమంగా మైగ్రైన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అల్లం,మిరియాలు,నిమ్మరసం తలనొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే పని ఎక్కువగా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.