సూపర్ స్టార్ సినిమాల్లో ఈ సీన్ తప్పనిసరి…. ఆ సీన్ ఏమిటో తెలుసా ?
Mahesh Babu Movies: ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో రేంజ్ ఉంటుంది. కొందరికి యాక్షన్స్ సీన్స్,మరికొందరికి సాంగ్స్,ఫైట్స్, ఇంకొందరికి అన్ని సీన్స్ కుదురుతాయి. స్టార్ ఇమేజ్ ,రేంజ్ ని బట్టి కథలు అల్లుతారు. తద్వారా వాళ్ళ పాత్రలను మరింత ఎలివేట్ చేస్తారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే, ఎప్పుడూ కొత్తదనంతో ఆలోచిస్తూ డిఫెరెంట్ స్టైల్ లో సినిమా చేస్తూ ఉంటాడు.
బాక్సాఫీస్ వేగాన్ని పెంచుతూ ఉంటాడు. పరుగెత్తే సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఏ సినిమా తీసుకున్నా మహేష్ ఏదో ఒక సందర్భంలో పరుగెడుతూ కనిపిస్తాడు. అది ఓ స్పెషాలిటీ గా ఉంటుంది. ఇక డైలాగ్స్ , యాక్షన్ , ఫైట్స్ ఇవన్నీ మరోలెవెల్లో ఉంటాయి. ఎంతోమంది పలు సందర్భాల్లో ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. మరి తాజా సినిమాలో పరుగు సీన్ ఉంటుందా ఉండదా చూడాలి.