రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు
Soaked Foods in Telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటానికి ఆసక్తి చూపుతున్నారు. కొన్ని ఆహారాలను నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తింటే ప్రయోజనాలను పొందవచ్చు.
రాత్రి సమయంలో 4 బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన బాదం పప్పు తొక్క తీసి తినాలి. బాదం పప్పులో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అధిక బరువును తగ్గించటమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ప్రతి రోజు ఒక అంజీర్ ని నానబెట్టి తింటే…ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు లేకుండా చేస్తుంది. అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది.
ప్రతి రోజు ఒక స్పూన్ శనగలను నీటిలో 5 గంటల పాటు నానబెట్టి తింటే శరీరానికి అవసరమైన్ ప్రోటీన్ అందుతుంది. శనగలో యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాలలో అడ్డంకులు లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య కూడా ఉండదు.
ప్రతి రోజు రాత్రి సమయంలో అరస్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నొప్పులను తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.