Healthhealth tips in telugu

స్నానం చేసే నీటిలో 1 స్పూన్ కలిపితే నొప్పులు,బెణుకులు తగ్గి కండరాలు ఉత్తేజితం అవుతాయి

Epsom salt uses :స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో ఒక స్పూన్ ఎప్సం సాల్ట్ ను(Epsom salt) వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ ని స్నానపు నీటిలో వేసి స్నానం చేస్తే నొప్పిగా ఉన్న కండరాలు ఉపశమనం పొందుతాయి.

ఎప్సం సాల్ట్ లో ఉండే Magnesium నొప్పుల్ని తగ్గించి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. ఇవి ఏంతో ప్రాముఖ్యత చెందినవి. స్నానపు నీటిలో వీటిని వాడితే వ్యర్ధ పదార్ధాలని బయటకి పంపించి పొట్టని ఫ్లాట్ గా చేస్తాయి.ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి.

ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది.
Face Beauty Tips In telugu
యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. మన సెలెబ్రిటీలు యంగ్ గా కనపడడానికి ప్రధానంగా ఇదే వాడతారు. దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 – 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.