కొండవీటి దొంగ కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంతో తెలుసా…శ్రీదేవి పెట్టిన కండిషన్ ఇదే
Chiranjeevi Kondaveeti Donga Movie : సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో హాలీవుడ్ రాబిన్ హుడ్ తరహాలో వచ్చిన మూవీ కొండవీటి దొంగ. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టేట్ రౌడీ అనూహ్య ఓపినింగ్స్ తెచ్చింది. ఇక లంకేశ్వరుడు, రుద్రనేత కమర్షియల్ గా నిరాశ పరిచాయి. దాంతో వెరైటీ క్యారెక్టర్ తో సినిమా చేయాలని చేసిన కొండవీటి దొంగలో రాధ, విజయశాంతి హీరోయిన్స్ గా చేసారు. ఈమూవీ సిక్స్ ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తెలుగులో రూపొందిన మొట్ట మొదటి సినిమా ఇది.
కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ రచన బాధ్యత తీసుకున్నారు. హాలీవుడ్ లెవెల్లో ఆలోచించి 10రోజుల్లో కథ రెడీ చేసారు. యండమూరి వీరేంద్రనాధ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.కొండవీటి దొంగ టైటిల్ పెట్టారు. హీరోయిన్ గా శ్రీదేవి దగ్గరకెళ్ళి పరుచూరి బ్రదర్స్ అడిగారు. చేయడానికి రెడీ కానీ, టైటిల్ కొండవీటి రాణి అని కూడా పెట్టాలి అని కండీషన్ పెట్టింది.
కానీ దీనికి కొండవీటి దొంగ కరెక్ట్. హీరోయిన్ పేరు కల్పితే తేడా వస్తుందని వచ్చేసారు. దీంతో కథలో కొన్ని మార్పులు చేసి విజయశాంతిని సెలక్ట్ చేసి,సెకండ్ హీరోయిన్ కూడా కల్పించి అందుకు రాధను తీసుకున్నారు. విలన్ గా అమ్రిష్ పురి. శారద,సత్యనారాయణ,రావు గోపాలరావు,మోహన్ బాబు తారాగణంగా సెలెక్ట్.నాగేంద్రబాబుని ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నారు. 1989నవంబర్ లో షూటింగ్ స్టార్ట్.
చెన్నై,తలకోన అడవి,మధుమలై అడవి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. క్లైమాక్స్ ఫైట్ ట్రైన్ మీద తీసినప్పుడు చిరంజీవికి గాయాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు. గాయాలతోనే ఏవిఎం లో ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. మొత్తానికి కొండవీటి దొంగ షూటింగ్ అయింది. ఇళయరాజా మ్యూజిక్ లో పాటలు సూపర్ హిట్. 1990మార్చి 9న మూవీ భారీ అంచనాలతో రిలీజయింది.
చిరు నటన,మేనరిజం,ఫైట్స్,సాంగ్స్ తో అదరగొట్టేసాడు. విలనిజంలో అమ్రిష్ భయపెట్టాడు. మిగిలిన పాత్రల్లో ఎవరికి వాళ్ళు సమర్ధంగా పోషించారు. కోదండరామిరెడ్డి అద్భుతంగా తీశారు.మొదటి వారం 75లక్షలు వసూలు చేసి, సింహాసనం మూవీ తర్వాత స్థానంలో నిల్చింది. తొలివారమే ఒక కోటి 25లక్షలు వసూలుచేసింది. హైదరాబాద్ దేవి, వైజాగ్ జగదాంబ థియేటర్స్ ఫుల్ రన్ నడిచాయి. 4ఆటలతో జగదాంబ ఆడిన మొదటి సినిమా ఇదే. కాకినాడ ఆనంద్ లో 107రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడింది.