MoviesTollywood news in telugu

సొంత సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోలు

Tollywood Movies:సినిమా తీయడం కత్తిమీద సామే. ఎన్నో అంచలనాలతో తీస్తే ప్రేక్షకుడు ఈజీగా సినిమా మీదా జడిమెంట్ ఇచ్చేస్తాడు. అందుకే హిట్,ప్లాప్ అనేవి ఆడియన్స్ తీర్పుని బట్టి ఉంటాయి. అయితే ప్లాప్ అని ఒప్పుకోడానికి చాలామంది సెలబ్రిటీలు గతంలో ఒప్పుకోడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. పబ్లిక్ గా కూడా ప్లాప్ గురించి మాట్లాడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసిన జానీ, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలు ప్లాప్ అని చాలా సార్లు అంగీకరించాడు.

కింగ్ నాగార్జున సోషల్ మీడియా సాక్షిగా రామ్ గోపాల్ వర్మతో వచ్చిన ఆఫీసర్ సినిమా ప్లాప్ అని ఒప్పుకున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన సైనికుడు మూవీ ఆడలేదని శ్రీమంతుడు సినిమా ఫంక్షన్ లో స్వయంగా సూపర్ స్టార్ మహేష్ చెప్పాడు. నేచురల్ స్టార్ నాని కూడా కృష్ణార్జున యుద్ధం హిట్ అని సోషల్ మీడియాలో పెట్టి,ఆతర్వాత అంతలేదు, బాబాయ్ అంటూ ట్వీట్ చేసాడు. ఆరెంజ్ మూవీ ఆడలేదని, వినయ విధేయరామ ప్లాప్ అని కూడా రామ్ చరణ్ ఒప్పుకున్నాడు.
Bigg Boss 5 Telugu Nagarjuna
టెంపర్ ఆడియో లాంచ్ లో తన గత సినిమాలు నిరాశ పారించినందుకు సారీ చెబుతూ టెంపర్ హిట్ అవుతుందని తారక్ చెప్పుకొచ్చాడు. జగడం మూవీ ప్లాప్ అని ఓ ఇంటర్యూలో రామ్ పోతినేని ఒప్పుకున్నాడు. ఇక రవితేజ కూడా దేవుడు చేసిన మనుషులు ,కిక్ 2మూవీస్ ప్లాప్ అని ఒప్పుకున్నాడు. నోటా మూవీ ప్లాప్ అని విజయ్ దేవరకొండ ఒప్పుకున్నాడు. లై,చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం ప్లాప్ అని భీష్మ ప్రమోషన్ లో యువహీరో నితిన్ ఒప్పుకున్నాడు.