Healthhealth tips in telugu

రాత్రి పడుకొనే ముందు 2 యాలకులు తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

cardamom Health benefits in telugu :యాలకులను పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడుతున్నారు. యాలకులను సుగంధ ద్రవ్యాలలో రాణిగా పేర్కొంటారు. అంతేకాక సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. యాలకులలో పచ్చ,నల్ల యాలకులు అనే రెండు రకాలు ఉన్నాయి.
cardamom in telugu
పచ్చ యాలకుల శాస్త్రీయ నామం ఇలటేరియా కార్డిమమ్‌. నల్ల యాలకుల శాస్త్రీయ నామం అమెమం. అయితే మనం ఎక్కువగా పచ్చ యలకులనే వాడుతూ ఉంటాం.యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. యాలకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. శరీరానికి చలువ చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.యలకులను స్వీట్స్ లో,బిరియానిలలోమరియు మసాలా వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తాం.
cardamom
యాలకులు వంటకు మంచి రుచిని మరియు వాసనను అందిస్తుంది. యాలకులు శరీరంలో వ్యర్ధాలను తొలగించటంలో బాగా సహాయం చేస్తాయి. అలాగే నోటి దుర్వాసనను తొలగించటంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. యాలకులు చూడటానికి చిన్నగా ఉన్నా ధర మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
gas troble home remedies
ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యాలకుల్లో ఉన్న లక్షణాలు తీసుకున్న ఆహారాన్ని బాగా జీర్ణం కావటానికి అవసరమైన ఎంజైమ్స్ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలు అయినా కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక యాలక్కాయను నమిలితే తగ్గుతుంది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం,ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం,గుండె పనితీరును మెరుగుపరచడం,రక్త సరఫరా బాగా జరిగేలా చేయటం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాక రక్తంలో కొలస్ట్రాల్ లేకుండా చేస్తుంది.

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక యాలక్కాయను నోటిలో వేసుకొని నమిలితే డిప్రెషన్ నుంచి ఉపశమనం కలగటమే కాకూండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆ సమయంలో యాలకుల టీ త్రాగిన మంచి ఉపశమనం కలుగుతుంది. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి.ఆస్తమా తగ్గించటానికి కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
sleeping problems in telugu
నిద్రలేమి సమస్య ఉన్నవారు రెండు యాలకులను తీసుకొని మెత్తగా దంచి నీటిలో వేసి మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. యాలకుల నీటిని రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. యాలకులను వెగించి పొడిగా చేసుకొని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు రెండు యాలకులను తిని గోరువెచ్చని నీటిని తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.