ఈ పండ్లను మీరు ఎప్పుడైనా తిన్నారా… ఈ నిజం తెలిస్తే అసలు వదలరు
Eetha Kayalu Benefits : పామే కుటుంబానికి చెందిన ఈత చెట్టు శాస్త్రీయ నామము ‘ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్’. దీనిని పండ్ల కోసం పెంచుతారు. ఈత చెట్టు నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు. ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో దొరుకుతాయి. పల్లెలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.
యెల్లో బెర్రీస్‌గా పిలిచే ఈత పళ్ళు మన భారతదేశంలోనే కాకుండా ఎడారి ప్రాంతంలో కూడా పండుతాయి. ఈత కాయలైతే కాస్త వగరుగా, బాగా పండిన పండ్లు అయితే తియ్యగా ఉంటాయి.ఈత కాయలు మొదట ఆకూ పచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి.
ఈ వేసవిలో లభించే ఈత పండ్లను ప్రతి ఒక్కరు తినాలి. ముఖ్యంగా పిల్లలు తింటే వారి ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా calcium ఉండుట వలన ఎముకలు బలంగా ఉంటాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అందువల్ల అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్ లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్టోజ్ లు తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు ఎక్కువగా పల్లెటూరులో రోడ్డు పక్కన ఎటువంటి పురుగు మందులు వేయకుండా చాలా నేచురల్ గా పండటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈత పండ్లు రెగ్యులర్ గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుండి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినటం వలన వేడి తగ్గుతుంది. అలాగే నిస్సత్తువ,అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.