సోంపులో తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Fennel seeds and honey benefits : సోంపు,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక సీసాలో సగం వరకు సొంపు గింజలను వేసి దానిలో తేనెను పోయాలి. సొంపు గింజలు మునిగేవరకు పోయాలి. ఈ సీసాకు మూత పెట్టి మూడు రోజుల పాటు కదపకుండా ఉంచాలి.
ఆ తర్వాత రోజుకి ఒక స్పూన్ చొప్పున ఉదయం పరగడుపున తినాలి. ఈ విధంగా ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
రక్తాన్ని శుద్ది చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటి వాటిని తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది. దగ్గు,జలుబు,శ్వాసకోశ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
తేనె కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. గుండెల్లో మంట,ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. సొంపు,తేనె రెండు మనకు సులభంగా లభ్యం అవుతాయి. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.