ఈ ఇడ్లీ తింటే డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్, అధిక బరువు, అలసట,నీరసం ఉండవు
jowar idli Benefits in telugu : ఈ ఇడ్లీ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలా మంది ఇడ్లీ తినటానికి ఆసక్తి చూపరు. అయితే ఇప్పుడు చెప్పే జొన్న ఇడ్లీ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక మినపప్పు లేదా మినప గుళ్ళను నీటిలో నానబెట్టాలి. రెండు కప్పుల జొన్న రవ్వను కూడా నీటిలో వేసి నానబెట్టాలి.
ఈ రెండింటినీ సుమారు ఆరు గంటల పాటు నానబెట్టాలి. మినపప్పును శుభ్రంగా కడిగి రుబ్బుకోవాలి. దీనిలో నానబెట్టిన జొన్న రవ్వను ఉప్పును వేసి బాగా కలిపి ఆరు గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీ వేసుకొని తినవచ్చు. ఈ జొన్న ఇడ్లీలను వారంలో మూడు సార్లు తింటే డయబెటిస్,అధిక బరువు ఉన్నవారికి చాలా హెల్ప్ అవుతుంది.
జొన్నల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా అరుగుతాయి. దాంతో రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అందుకనే జొన్నలు బరువు తగ్గే ప్రణాళిక ఉన్నవారికి, డయాబెటిస్ ఉన్నావరికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జొన్నలలో విటమిన్ B6 సమృద్దిగా ఉండుట వలన రోజంతా అలసట,నీరసం లేకుండా ఉషారుగా ఉంటారు. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.