Healthhealth tips in telugu

పైల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Piles Problem :మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు కూర్చోలేరు..అలా అని ఎక్కువసేపు నిలబడలేరు. పైల్స్ సమస్యకు మనం తీసుకునే ఆహారం, జీర్ణక్రియ సరిగ్గా లేక మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి ప్రయోజనం కనపడదు. .
piles home remedies
ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బాగా పండిన అరటి పండు లేదా మధ్యస్తంగా ఉన్న అరటి పండును తీసుకొని కట్ చేయాలి. తర్వాత పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటి పండు ముక్కలో పెట్టుకోవాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినాలి. ఈ అరటి పండు తిన్నాక అరగంట వరకు ఏమి తినకూడదు…తాగకూడదు.
Piles Fruits
పచ్చి అరటి పండు ఉపయోగించకూడదు. ఈ విధంగా రోజులో ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇలా తినలేని వారు పచ్చ కర్పూరం పొడి చేసుకుని అరటి పండు ముక్కలపై జల్లుకుని తినేయాలి. ఇలా మూడు రోజుల పాటు తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ చిట్కా పాటిస్తూ ఉప్పు, కారం,మసాలాలు తగ్గించాలి. పైల్స్ సమస్య ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.