రోజుకు కేవలం 15 నిమిషాలు నడిస్తే.. ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?
Walking Benefits In telugu : ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు మరియు బిజీ జీవనశైలి కారణంగా మనలో చాలామందికి ఎక్సర్ సైజ్ చేయటానికి అసలు సమయమే చిక్కటం లేదు. దాంతో స్థూలకాయం, బీపీ, షుగర్, గుండె పోటు, ఒత్తిడి ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి.
ఈ సమస్యల నుండి బయట పడటానికి ఎక్సర్ సైజ్ చేసే సమయమే లేనివారు కేవలం 15 నిమిషాలు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెప్పు తున్నారు. వాకింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు 15 నిమిషాల పాటు నడిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. తద్వారా గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉండటమే కాకుండా.శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రక్తపోటు ఉన్నవారిలో రక్త నాళల్లో రక్త ప్రవాహనికి సరిపోయే ఆక్సిజన్ సప్లే అయ్యి కండరాలు మరింత రిలాక్స్ గా అయ్యి.బ్లడ్ ప్రెజర్ ను అదుపులోకి తెస్తుంది. కీళ్లు దృడంగా ఉండి కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
అధిక బరువు తగ్గి చాలా చురుకుగా మారతారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాయామం చేస్తేనే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.