ఛత్రపతి సినిమా గురించి ఈ విషయాలు తెలుసా….లాభం ఎన్ని కోట్లో ?
Prabhas Chatrapathi Movie:సినిమాల్లో కొందరి కాంబినేషన్ అదిరిపోతోంది. కానీ ఎందుకో ఎప్పటికో కానీ అది జరగదు. సరిగ్గా ప్రభాస్,ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ కి అలాగే చాలా టైం పట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ చేసాక ప్రభాస్ తో చేయాలని జక్కన్న భావించాడు. అయితే ఆసమయంలో ప్రభాస్ ఈశ్వర్ మూవీ చేస్తున్నాడు. అలాగే సింహాద్రి తర్వాత కూడా జక్కన్న ట్రై చేసిన పనవ్వలేదు.
భోగవల్లి ప్రసాద్ ఫ్యామిలీకి కీరవాణి బాగా దగ్గర రిలేషన్. అందుకే ఆయనమూవీస్ కి కీరవాణి మ్యూజిక్ ఇవ్వాల్సిందే. అందుకే జక్కన్నతో మూవీ చేయాలని ప్రసాద్ భావించి ఎంత బడ్జెట్ అయినా పర్లేదని కూడా అఫర్ ఇచ్చారు. ఇక ప్రభాస్ తో బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన అడవిరాముడు సినిమాలో హీరోయిన్ పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తే, ‘నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’అంటాడు. ఆ డైలాగ్ డెలివరీ జక్కన్నకు బాగా నచ్చేసింది.
దీంతో ప్రభాస్ తో ఎమోషనల్ మూవీ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గరకు వెళ్లి ఓ కథ రెడీ చేయమని అడిగాడు.అలా రాసిన కథే ఛత్రపతి. తల్లి సెంటిమెంట్ తో రాయాలని అడిగిందే తడవుగా స్కార్ పేస్ ఇంగ్లీషు సినిమాలోని అంశాలు కదిలించడంతో దాని ఆధారంగా కథ అల్లేశారు. ఆరాత్రి భార్యకు చెబితే ఆమె ఏడుపు ఆపుకోలేక ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదట.
మర్నాడు జక్కన్నకు కథ వినిపించడంతో నచ్చేసింది. ఈ కథ గురించి ఆఫీసులో చర్చిస్తుంటే పద్మాలయ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే గోపీ విని , భలే ఉంది సార్ కదా. దీనికి ఛత్రపతి అని పేరుపెట్టండి అనేశాడు. జక్కన్నకు టైటిల్ నచ్చేసింది. ఛత్రపతి శివాజీకి తల్లే స్ఫూర్తి. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ సరిపోతుందని ఖాయం చేసారు. ఎం రత్నంతో డైలాగ్స్ రాయించారు. కామెడీ కూడా పండాలని అపరిచితుడుకి పేరడీ చేసారు. హీరోయిన్ గా శ్రేయ ఒకే. విలన్ గా ప్రదీప్ రావత్,మరో విలన్ నరేంద్ర చౌ ఖరారుచేసాడు. కాట్రాజుగా సుప్రీత్ ని, ప్రభాస్ బ్రదర్ గా షఫీ ని సెలక్ట్ చేసాడు.
ఇక ప్రభాస్ తల్లి పాత్రకు భానుప్రియను అనుకున్నారు. కానీ ఆమె అమెరికా ప్రయాణం పెట్టుకోవడంతో జక్కన్న వెళ్లి బతిమాలి కథ చెప్పాక ఆమె ఒకే చెప్పేసింది. సెంథిల్ కి కెమెరా మాన్ బాధ్యతలు అప్పగించి ఎలా తీస్తావో నీ ఇష్టం అని ఫ్రీడమ్ ఇచ్చేసాడు. ఇక కీరవాణి మ్యూజిక్ సరేసరి. స్లీపింగ్ హాలో అనే హాలీవుడ్ సినిమాలో వాడిన కెమెరాలను ప్రత్యేకంగా రప్పించి ఓ ఫైట్ సీక్వెన్స్ లో వాడాడు. ఏ వచ్చి బి వాలి పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ తో పాడించాలని చూస్తే ,ఆసమయానికి ఫారిన్ లో ఉండడంతో కీరవాణి పాడేశారు. వైజాగ్ సముద్రంలో తొలిషాట్. భోగవల్లి ప్రసాద్ కంగారుగా ఉంటె, జక్కన్న,ప్రభాస్ కూల్ గానే ఉన్నారట.
కానీ చాకచక్యంగా సీన్స్ తీసేసారు. కొరియోగ్రాఫర్ లారెన్స్ అదరగొట్టాడు. అనుకున్న సమయానికి నెల్లూరులో క్లైమాక్స్ తో షూటింగ్ పూర్తయింది. 12న్నర కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 2005సెప్టెంబర్ 30న రిలీజయింది. మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినా ఆతర్వాత అనూహ్యంగా ఎత్తేసుకుంది. 54సెంటర్స్ లో వందరోజులు ఆడేసింది. హిందీ లో డబ్బింగ్ అయిన ఈమూవీ కన్నడంలో ఛత్రపతిగా, బెంగాలీలో రేఫుజిగా రిమేక్ అయింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి,బెస్ట్ సహాయనటిగా భానుప్రియ నంది అవార్డులు అందుకున్నారు.