Healthhealth tips in telugu

ఇలా చేస్తే చాలు అధిక బరువు,బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Garlic Weight Loss Tips : మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం,వ్యాయామం చేయకపోవటం,ఎక్కువసేపు కూర్చొని ఉండటం, వంశపారంపర్యం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. రోజులో అరగంట వ్యాయామం చేస్తూ పోషకాలు ఉన్న ఆహారం తింటూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే సరిపోతుంది.
garlic
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేశాక తాగవచ్చు. ఇలా తాగటం ఇబ్బందిగా ఉండే రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి నిమ్మరసం కలిపి తాగవచ్చు.
Garlic side effects in telugu
వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి నీటిలో మరిగించి వడకట్టి కూడా తాగవచ్చు. వీలును బట్టి తాగవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బలను కాల్చి తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ప్రతి రోజు 15 రోజుల పాటు తాగితే శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపుతుంది. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Weight Loss tips in telugu
జీర్ణ శక్తి పెరుగుతుంది. తినాలనే కోరిక తగ్గటమే కాకుండా తొందరగా ఆకలి కూడా వేయదు. వెల్లుల్లిని ఇప్పుడు చెప్పిన విధానంలో మీకు వీలు అయిన విధానాన్ని ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.