డయాబెటిస్ ఉన్నవారు తమలపాకు తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Betel leaf tea for diabetes : తమలపాకులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు చిన్న తమలపాకును తినవచ్చు. లేదా తమలపాకుతో కషాయం చేసుకుని కూడా తాగవచ్చు. ఒక గ్లాస్ నీటిని పొయ్యి మీద పెట్టి ఒక తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టాలి.
ఈ నీటిని ఉదయం సమయంలో తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగితే ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. తమలపాకు యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
తమలపాకు తీసుకోవటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉంటుంది. తమలపాకు చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
అలాగే అధిక బరువు, శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. తమలపాకు ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి రోజుకి ఒక ఆకు మించి తీసుకోకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.