సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా….స్టార్ హీరో ని రిజెక్ట్ చేసిందా….?
Tollywood Actress Sangeetha: ప్రేమించిన వ్యక్తికోసం కన్నవాళ్లనే కాదు ఆస్తి కూడా వదులుకునేవాళ్లను చూస్తుంటాం వింటుంటాం. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఓ స్టార్ హీరోని కూడా వదులుకుందంటే నిజంగా ఆశ్చర్యమే కదా. పైగా స్టార్ హీరోతో చిన్నప్పటి నుంచి స్నేహం కూడా ఉంది. అయినా అతడు చేసిన ప్రపోజ్ ని కాదనేసి,ప్రేమించినవాడినే పెళ్లాడింది.
ఇంతకీ వాళ్లేవారంటే,… క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం మూవీలో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’అని డైలాగ్ చెప్పిన నటి సంగీత. మరోపక్క తమిళ స్టార్ హీరో విజయ్. అవును, వీరిద్దరూచిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. మలయాళ మూవీ గంగోత్రి ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత తెలుగులో ఖడ్గంతోనే ఆడియన్స్ కి దగ్గరైంది. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా,సైడ్ హీరోయిన్ గా చేసింది. ఇక సరిలేరు నీకెవ్వరు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది.
సంగీత తాతయ్య కె ఆర్ బాలన్ అప్పట్లో తమిళంలో పెద్ద నిర్మాత. అందుకే సంగీత చెన్నైలో పుట్టి పెరిగింది. అలా హీరో విజయ్ తో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. అయితే తమిళ సింగర్ ని ప్రేమించింది. విషయం తెల్సిన విజయ్ చివరకు సింగర్ కి కూడా నచ్చజెప్పే యత్నం చేసినా సరే, సంగీత సింగర్ నే పెళ్లాడింది. దీంతో చేసేదిలేక ఆమె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని భావించాడు విజయ్. అందుకే ఇద్దరి మధ్యా స్నేహ బంధం కూడా కొనసాగుతోంది.