Tollywoodలో ఈ బంధుత్వాలు గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాలసిందే
Tollywood News: సినిమా హీరో హీరోయిన్స్ లను అనుకరించే వాళ్ళు తెలుగులో ఎక్కువే. ఇక సెలబ్రిటీల విషయాలు తెలుసుకోవడం మీద కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. అది ఏ అంశమైనా సరే ఆసక్తిగా వింటారు. వారి బంధువుల గురించి కూడా ఆసక్తి ఉంటుంది. మహానటి సావిత్రి,బాలీవుడ్ నటి రేఖ ను పరిశీలిస్తే ఇద్దరూ తల్లీ కూతుళ్లు అవుతారు.
సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్న జెమిని గణేశన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురే రేఖ. కమల్ హాసన్ , సుహాసిని తీసుకుంటే,సుహాసిని కమల్ స్వయానా బాబాయ్. కమల్ అన్నయ్య చారు హాసన్ కూడా నటుడే. చారుహాసన్ కూతురే సుహాసిని. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం ని 1988లో ఈమె వివాహం చేసుకున్నారు.
కళాతపస్వి కె విశ్వనాధ్,నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు. అందుకే తన సినిమాల్లో చంద్రమోహన్ ని విశ్వనాధ్ ఎంకరేజ్ చేసారు. నటి,డైరెక్టర్ విజయనిర్మల , సహజనటి జయసుధకు వరుసకు అత్తవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురంలో జయసుధ ఎంట్రీ ఇచ్చింది. మతం మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్, జివి ప్రకాష్ ల బంధం తీసుకుంటే ,సంగీత దర్శకునిగా పరిచయం అయి,హీరోగా మారిన ప్రకాష్, స్వయంగా రెహ్మాన్ సొంత అక్క కొడుకే.
సాహో సినిమాలో పవర్ ఫుల్ రోల్ వేసిన అరుణ్ విజయ్ ఎవరంటే, ప్రముఖ నటుడు విజయకుమార్ మొదటి భార్య కొడుకు. ఇక మొదటి భార్య చనిపోయాక మంజులను పెళ్లాడారు. అనేక సినిమాల్లో వేసిన స్టార్స్ ప్రీతి, ,శ్రీదేవి వీరి సంతానమే. ఇక తమిళ సూపర్ స్టార్ మేనల్లుడి సంగీత దర్సుకుడు అనిరుద్.
బాలీవుడ్ లో సత్తా చాటిన నటి విద్యాబాలన్, తెలుగులో అలాగే పలు భాషల్లో నటించిన ప్రియమణి కజిన్స్ అవుతారు. ఇక గాయని మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడలు అవుతుంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ షబానా అజ్మీ ,టబు బంధం చూస్తే,షబానా అన్న కూతురే టబు. 1990లలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన నగ్మా కు హీరోయిన్స్ ,జ్యోతిక,రోహిణి చెల్లెల్లు అవుతారు. నగ్మా తల్లి పోయాక తండ్రి మళ్ళీ పెళ్లిచేసుకోవడంతో జ్యోతిక,రోహిణి జన్మించారు. జ్యోతిక హీరో సూర్యను పెళ్లాడింది.
ఐశ్వర్య రాజేష్,శ్రీలక్ష్మి బంధం తీసుకుంటే,శ్రీలక్ష్మి సోదరుని కూతురు. ఒకప్పుడు హీరోగా చేసి, సడన్ గా మరణించిన రాజేష్ కూతురైన ఐశ్వర్య స్వయానా శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది. ఎన్నో విజయవంతమైన మూవీ నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బీ చౌదరి కొడుకే నటుడు జీవా. జీవా నటించిన రంగం మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. చౌదరి మరో కుమారుడు జిషన్ కూడా కొన్ని సినిమాలు చేసాడు. దర్శకుడు సెల్వ రాఘవన్ కి నటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతాడు. మొదటి భార్యకు విడాకుల తర్వాత విద్యుల్లేఖ సోదరిని సెల్వ పెళ్లిచేసుకున్నారు.