ఇలా చేస్తే 15 రోజుల్లో బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది
Pudina Weight Loss : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చోవటం, సరైన పోషకాలు తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 5 లవంగాలు, నిమ్మకాయలో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నిమిషాలు మరిగాక 15 పుదీనా ఆకులను వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం సమయంలో తాగాలి. రుచి కోసం అరస్పూన్ తేనె కలపవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. లవంగాలు జీవక్రియ రేటును పెంచి కొవ్వు వేగంగా కరగటానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
పుదీనాలో ఉన్న లక్షణాలు బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే కేవలం 15 రోజుల్లోనే బరువు తగ్గటాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.