వీటిని ఇలా తీసుకుంటే క్షణాల్లో నిద్ర పడుతుంది…నిద్రలేమి సమస్య జీవితంలో ఉండదు
sleeping problems in telugu :రాత్రి కలత నిద్ర లేకుండా మంచి నిద్ర పడితే మరుసటి రోజు ఎలాంటి చికాకు లేకుండా ప్రశాంతంగా ఉంటాం. అంతేకాకుండా మంచి ఆహారం సరైన నిద్ర ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఉన్న జీవనశైలి పరిస్థితుల కారణంగా మరియు ఒత్తిడి వంటి కారణాలు తో సరైన నిద్ర చాలామందికి పట్టడం లేదు.
అయితే కొంతమందికి ఎటువంటి సమస్యలు లేకపోయినా నిద్ర రాదు. అలాంటి వారు రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ తెల్లవారే సమయానికి నిద్రపోతూ ఉంటారు. అలా లేటుగా లేస్తూ ఉంటారు. అలా లేటుగా లేగటం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలను వేసి నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగాలి లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ధనియాలలో ఉండే లక్షణాలు నిద్రను ప్రేరేపిస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే సమస్య తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.