గుప్పెడు గింజలను ఇలా తింటే డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
Chikkudu ginjallu benefits : చిక్కుడు కాయలను సీజన్ లో వచ్చినప్పుడు తింటూ ఉంటాం. చిక్కుడు గింజలను ఎండబెట్టి సంవత్సరం పొడవునా తినవచ్చు. ఇవి మార్కెట్ లో కూడా దొరుకుతాయి. వారంలో 4 సార్లు ఈ గింజలను ఉడికించుకొని లేదా కూర చేసుకొని తినవచ్చు. ఇలా తినటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం, మాంసకృత్తులు,యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), విటమిన్లు (Vitamins) వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా మేలును చేస్తుంది. వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలకు అంది ఎముకలు దృడంగా మారుతాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారికి బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. చిక్కుడు గింజలను రోజుకి పావు కప్పు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిని తీసుకున్నప్పుడు కడుపులో ఉబ్బరంగా అనిపించే అవకాశం ఉండి. గ్యాస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.