ఈ సీజనల్ ఫ్రూట్ ఎంత మేలు చేస్తుందో తెలిస్తే…అసలు నమ్మలేరు…ఇది నిజం
Pomelo Fruit Health benefits In telugu : పంపర పనస అనేది సిట్రస్ కుటుంబానికి చెందినది. పంపర పనస తొనలలో ముత్యాలు పులుపు,తీపి రుచితో ఉంటాయి. ఈ పండు పై పొర చాలా మందంగా మృదువుగా ఉండి ఒలవటానికి సులభంగానే ఉంటుంది. తొనలలో ముత్యాలు పసుపు మరియు పింక్ మరియు ఎరుపు రంగులలో ఉంటాయి. ఈ పండును తొనల రూపంలో తినవచ్చు లేదా జ్యుస్ రూపంలో తీసుకోవచ్చు.
పంపర పనసలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో పోషకాలతో నిండి ఉంది. పంపర పనసలో విటమిన్ సి మరియు విటమిన్ బి, బీటా కెరోటిన్ మరియు ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలా సహాయకారిగా ఉంటుంది. పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
పంపర పనసలో విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2 మరియు సి, బయోఫ్లవనోయిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు,ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎంజైములు ఉంటాయి. ఇప్పుడు పంపర పనసలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. పంపర పనస యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.
దీనిలో ఉండే విటమిన్ సి మూత్రంలో ఆమ్ల స్థాయిని పెంచుతుంది మరియు మూత్ర మార్గంలోని బ్యాక్టీరియా అభివృద్ధిని తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య తరచుగా వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే రెగ్యులర్ గా పంపర పనసను తీసుకోవాలి. గాయపడిన కణజాలాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. విటమిన్ సి లోని ఎంజైములు కొల్లాజెన్ అనే ప్రోటీన్ అభివృద్ధికి సహాయపడతాయి.
దాంతో కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. చిగుళ్ల నుండి రక్తస్రావం తగ్గించి చిగుళ్లు,దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పంపర పనసలో ఉండే పొటాషియం,విటమిన్ సి గుండె ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. పెక్టిన్ ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. అలాగే మంచి కొలస్ట్రాల్ని పెంచి చెడు కొలస్ట్రాల్ ని తొలగిస్తుంది.
దాంతో ఎటువంటి గుండె సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. పంపర పనసలో ఉండే ఐరన్ రక్త సరఫరాను మెరుగుపరచటమే కాకుండా రక్త కణాల వృద్ధికి సహాయపడుతుంది. పంపర పనసలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి విషాలను,ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా జలుబు, ఫ్లూ, ఉబ్బసం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అలెర్జీలు వంటివి వస్తాయి. పంపర పనసలో బయోఫ్లవనోయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన క్యాన్సర్ పై పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్, పేగు మరియు రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. పంపర పనసలో ఉండే ఫైబర్ పెద్దప్రేగు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
అలాగే చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించి ముడతలు లేకుండా చర్మం యవన్నంగా,మృదువుగా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ పంపర పనస జ్యుస్ త్రాగితే చర్మం ప్రకాశవంతంగా మారటమే కాకుండా మృదువుగా ఉంటుంది. ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
ఈ పండును తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దాంతో తీసుకొనే ఆహారం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. ఈ పండులోని లక్షణాలు శరీరంలోని పిండి పదార్ధం మరియు చక్కెర పదార్థాన్ని తగ్గించే కొవ్వును బర్న్ చేయటానికి సహాయపడతాయి. కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఆస్టియో ఫ్లోరోసిస్ వ్యాధిని తగ్గించటమే కాకుండా ఎముకల పెళుసుగా లేకుండా ఫ్లెక్స్ బుల్ గా ఉండేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే కీళ్ల మధ్య గుజ్జును పెంచుతుంది. దాంతో కీళ్ల మధ్య ఫ్లెక్స్ బుల్ పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.