చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Uday kiran chitram full movie :వారసుల హవా నేపథ్యంలో సొంతంగా ఇండస్ట్రీకి వచ్చి ,టాప్ రేంజ్ లోకి దూసుకెళుతున్న సమయంలో హీరో ఉదయ్ కిరణ్ కెరీర్ ఊహించని దెబ్బతింది. దాంతో ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ముగించడం మాత్రం అందరికీ తీరని విషాదమే. అయితే తెలుగు ఇండస్ట్రీలోకి చిత్రంగా వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో ఉదయ్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయ్యాడు.
తేజ తెరకెక్కించిన చిత్రం సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకుని కెరీర్ స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే వేగంగా కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు.. ఆ తర్వాత కుదుపులు ఎదుర్కొన్నాడు. ఛాన్స్ లు సన్నగిల్లడం.. పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని సమస్యలు రావడంతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే 2000 ఏడాదిలో ఉదయ్ నటించిన చిత్రం సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడనేది తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమాకు తనతో పాటు చాలా మంది కొత్తవాళ్లు పని చేసామని, నిజానికి అందులో ఉదయ్ కిరణ్ హీరో కాదని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్ గ్రూపులో ఒకడిగా ఉదయ్‌ను ఎంచుకున్నానని.. హీరోగా మరో కుర్రాడిని అనుకున్నా కూడా ఆయన కాదనే సరికి చివరికి తననే తీసుకున్నానని తేజ అసలు విషయం చెప్పాడు
ఆ సినిమా అలా మొదలైందని.. చిత్రం సినిమా కోసం తనతో పాటు ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఇలా అందరికీ రామోజీ రావు 11 వేలు పారితోషికంగా ఇచ్చాడని తేజ గుర్తు చేసుకున్నాడు .సినిమాను 30 లక్షల్లోపే బడ్జెట్‌తోనే 31 రోజుల్లో తీసామని.. ఆ తర్వాత అది ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌తోనే నువ్వు నేను చేసి తేజ మరో సంచలనం సృష్టించాడు . 11 వేలతో మొదలై కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిన ఉదయ్ ఎన్నో శిఖరాలు ఎక్కాల్సిన సమయంలో కిందికి దిగజారి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు.