సపోటా పండు తింటే బరువు పెరుగుతారా…తగ్గుతారా…ఏది నిజం…?
Sapota Fruit benefits :ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా అధిక బరువు సమస్య అనేది పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మనిషిని మానసికంగా కృంగదీస్తుంది. బరువు పెరగటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. .
తీసుకునే ఆహారం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చోవడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని ఆహారాలు తింటే బరువు పెరుగుతారు కొన్ని ఆహారాలు తింటే బరువు తగ్గుతారు. అయితే సపోటా తింటే బరువు పెరుగుతారా తగ్గుతారా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.
చాలా రుచిగా ఉండే సపోటాపండు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. సపోటాలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. సపోటా పండ్లు పోషకాలతో పాటు కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తింటే అధిక బరువు సమస్య వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. .
బరువు తగ్గాలని అనుకొనే వారు సపోటా కి దూరంగా ఉండాలి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా సపోటాకి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే సపోటాలో చక్కెర, పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.