Healthhealth tips in telugu

వారంలో 3 సార్లు తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

Diabetic Juice Recipe : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. ఒక్క సారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఒక టమోటా,కీరదోశలో సగం, కాకరకాయలో సగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి అరకప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తీసుకోవాలి. ఈ విధంగా ఈ డ్రింక్ తీసుకోవటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా వేసవికాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది.

వేసవికాలంలో డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి కూడా తగ్గుతాయి. ఈ డ్రింక్ తీసుకోవటం వలన శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోయి అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.