ఈ ఒక్క ఆకురసంతో కిడ్నీలో రాళ్ళు కరిగిపోవటమే కాకుండా కిడ్నీ సమస్యలు అన్నీ మాయం
Atika Mamidi Benefits : ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన పూర్వీకులు ఆహార నియమాలు పాటిస్తూ శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించేవారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పైసా ఖర్చు పెట్టకుండా పెరటి మొక్కలతో వైద్యం చేసుకునే వారు.
మన ఇంటి చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా సరే వాటి గురించి మనలో చాలా మందికి తెలీదు. లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని ఎన్నో వ్యాధులను తగ్గించే ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో అటిక మామిడి తీగ ఒకటి. ఇది గ్రామీణ ప్రాంతంలో విరివిగా పెరుగుతుంది. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా పిలుస్తుంటారు.
ఈ అటిక మామిడి తీగ కిడ్నీలో రాళ్ళు,కిడ్నీ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుందని,కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాక తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అటిక మామిడి తీగ మొక్కను ఆకుకూరగా వండుకొని తినవచ్చు.
అలాగే కషాయం చేసుకొని తాగవచ్చు. తాజా అటిక మామిడి మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా కట్ చేసి 200 మి.లీ. నీటిలో వేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని రసాన్ని మాత్రమే తీసుకొని ప్రతి రోజు ఉదయం పరగడపున 50 మి.లీ కషాయాన్ని తాగితే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. అయితే ఈ కాషాయన్ని తాగే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.