Healthhealth tips in telugu

నీటిలో 4 గంటలు నానబెట్టి తాగితే గ్యాస్,శరీరంలో పేరుకున్నకొవ్వు కరిగి బరువు తగ్గుతారు

Shahjeera benefits In Telugu : చూడటానికి జీలకర్ర వలె ఉండే షాజీర ఒక మసాలా దినుసు. ఇది ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. షాజీరాను అరస్పూన్ మోతాదులో తీసుకొని నీటిలో 4 గంటల పాటు నానబెట్టాలి.
shahjeera benefits
నానబెట్టిన షాజీరాను నీటితో సహ పొయ్యి మీద పెట్టి మూడు నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగటం వలన మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

అలాగే గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్రోన్కైటిస్ మరియు దగ్గు వంటి శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. షాజీరా ముఖ్యమైన విటమిన్ల యొక్క పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె మరియు విటమిన్ బి-కాంప్లెక్స్‌లో రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్ మరియు పిరిడాక్సిన్ ఉన్నాయి.
Weight Loss tips in telugu
అలాగే కాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. రాగి ఎర్ర రక్త కణాలను (RBC) ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ ఖనిజాలు మొత్తం ఆరోగ్య మెరుగుదలలకు మంచివి. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.