ఈ టీ తాగితే ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
Weight Loss Tea : మనలో చాలా మంది బరువు తగ్గటానికి మార్కెట్ లో దొరికే మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాకుండా మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ ఇప్పుడుఏ చెప్పే టీ తాగితే మంచి ఫలితం వస్తుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అంగుళం అల్లంను తురిమి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి. పచ్చి పసుపు కొమ్ము ఉంటే అంగుళం ముక్కను తురిమి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ డ్రింక్ ని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
ఈ టీ 15 రోజులు తాగితే ఆ తేడా చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన పదార్ధాలు అన్నీ ఆకలిని నియంత్రణలో ఉంచటమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువును తగ్గించటానికి సహాయపడతాయి. అలాగే ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
తేనెలో ఉన్న లక్షణాలు ఆకలిని నియంత్రణలో ఉండటానికి మరియు కొవ్వు కరిగించటానికి సహాయపడతాయి. పసుపు,అల్లం రెండూ బరువును తగ్గించటమే కాకుండా జీవక్రియ బాగా సాగేలా చేస్తుంది. ఈ టీ తాగితే నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.