Healthhealth tips in telugu

ఈ ఆకు నరాల బలహీనతను తగ్గించటమే కాకుండా కిడ్నీలో రాళ్ళను, కొవ్వును కరిగిస్తుంది

celery leaf benefits : మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అధిక బరువు, శరీరంలో అదనంగా పెరిగిన కొవ్వును తగ్గించటానికి సెలెరీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకును తినటం వలన జీర్ణ ప్రక్రియ వేగవంతం చేసి కొవ్వును కరిగిస్తుంది.
celery leaf benefits
అంతేకాకుండా డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఆకులను ఎక్కువగా సలాడ్ రూపంలో తింటారు. సెలెరీ ఆకు తినటం వలన శరీరంలోని మలినాలు అన్నీ తొలగిపోతాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది.

రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నరాల కణాల పెరుగుదల మరియు అభివృద్ధిని కూడా ప్రేరేపిస్తుంది.అలాగే నరాల బలహీనత సమస్య లేకుండా చేస్తుంది. సెలెరీ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది, తద్వారా మీ శరీరంలో ఒత్తిడిని నియంత్రిస్తుంది మరియు ఉపశమనం అందిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది.
Kidney Stones
కిడ్నీలో రాళ్ళను కరిగిస్తుంది. సెలెరీలోని ప్రధాన ఫ్లేవనాయిడ్‌లలో ఒకటైన అపిజెనిన్ అనేది కిడ్నీ రాళ్లలో కనిపించే కాల్షియం స్ఫటికాలను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.