Healthhealth tips in telugu

1 గ్లాసు తాగితే కోట్లు ఖర్చు పెట్టిన నయం కానీ రోగాలను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది

Healthy Drink : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు చాలా సులభంగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. మన ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అరకప్పు మునగాకు, పావుకప్పు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి నీటిని పోసి మిక్సీ చేయాలి.
Drumstick leaves benefits in telugu
ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఒక వారం రోజులు తాగి ఒక వారం గ్యాప్ ఇచ్చి తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
Curry Leaves Health benefits In telugu
అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారు నెల రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కంటిచూపు పెరుగుతుంది. కండరాలు బలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటివి ఏమి ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే ఈ డ్రింక్ తాగితే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.