ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…చిన్నప్పుడు ఎలా ఉందో?
Keerthy Suresh Childhood Pics:మహానటి మూవీతో ఎక్కడలేని ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తెలుగులో రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తొలిమూవీతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈభామ ఏకంగా మహానటి సావిత్రి క్యారెక్టర్ ని పండించి మహానటి మూవీతో రాత్రి రాత్రే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. చిన్నా పెద్దా ,ఆ తరం,ఈ తరం అనే తేడాలేకుండా అందరూ ఈ సినిమాను చూసారు.
ఓ విధంగా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి ఛాన్స్ లు కూడా తగ్గాయి. అందుకేంటే అంతబరువైన పాత్ర వేసాక అలాంటి సినిమాలైతేనే బాగుంటాయన్న టాక్ వచ్చేసింది. ఆ తర్వాత తనకు తగ్గట్టుగా వరసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
కాగా కొన్ని ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో కీర్తి పోస్ట్ చేసింది. చాలా క్యూట్ గా ఉన్నాయంటూ పలువురి నుంచి తెగ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఉన్న ఈ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే కీర్తి సురేష్ ఫాన్స్ మాత్రం ఈ ఫోటోలను షేర్ మీద షేర్ చేస్తున్నారు.