Healthhealth tips in telugu

ఇలా చేస్తే 15 రోజుల్లో బొడ్డు మరియు నడుము చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది

Weight Loss Drink : అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవటానికి ఒక డ్రింక్ తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ డ్రింక్ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.
chia seeds
చియా సీడ్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో మంటను తగ్గించటం,కొలెస్ట్రాల్ ని తగ్గించటం,ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
pineapple benefits
ఒక స్పూన్ చియా సీడ్స్ ని ఒక గ్లాస్ నీటిలో వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఇక రెండోది ఫైనాఫిల్. ఫైనాఫిల్ లో ఉండే బ్రోమెలైన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్‌ల మిశ్రమం, ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మాంగనీస్‌ అనేది కొవ్వు జీవక్రియలను పెంచుతుంది.
Weight Loss tips in telugu
ఒక కప్పు ఫైనాఫిల్ ముక్కలను, నానబెట్టిన చియా సీడ్స్ ని ఒక మిక్సీ జార్ లో వేసి కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి. ఈ డ్రింక్ ని ఫ్రిజ్ లో మూడు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే క్రమంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.