అర స్పూన్ గింజలు ఎముకలను ఉక్కులాగా….రక్తహీనత,ప్రోటీన్ లోపం లేకుండా చేస్తుంది
Calcium and Fiber Rich Seeds : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆహారాలలో Dill Seeds ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలలో Calcium, ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. ఈ గింజలను వేగించుకుని పొడి చేసుకుని కూరలు, చట్నీలు వంటి వాటిలో జల్లుకోవచ్చు. లేదంటే ఖర్జూరం వంటి వాటితో కలిపి లడ్డూలు చేసుకొని తినవచ్చు. ఇవి కమ్మటి వాసన మంచి రుచిని కలిగి ఉంటాయి. నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. సూక్ష్మపోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి.
Dill seeds ధర విషయానికి వస్తే కేజీ 250 రూపాయిల వరకు ఉంటుంది. 100 గ్రాముల గింజలలో 305 కేలరీల శక్తి,16 గ్రాముల ప్రోటీన్, 14.5 గ్రాముల కొవ్వు మరియు 55 గ్రాముల కార్బోహైడ్రేట్లు,21 గ్రాముల ఫైబర్, 21 mg విటమిన్ సి, 16 mg ఇనుము, 20 mg సోడియం,5 mg జింక్ మరియు 12 మైక్రోగ్రాముల సెలీనియం, 1520 మి.గ్రా కాల్షియం ఉంటాయి.
జింక్ మరియు సెలీనియం యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఐరన్, కాల్షియం మరియు ఫైబర్ లోపంతో బాధపడుతున్నారు. ఈ మూడు పోషకాలు Dill seeds లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎదిగే పిల్లలకు ఉపయోగపడుతుంది. శరీరం కాల్షియం శోషించడానికి విటమిన్ సి ముఖ్యం. విటమిన్ సి కూడా చాలా సమృద్దిగా ఉంటుంది.
అలాగే విటమిన్ కె కూడా ఉన్నందున, ఎముకలు కాల్షియంను బాగా శోషించుకుంటాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యను నివారించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.