గుప్పెడంత మనసు మహేంద్ర భార్య ఏమి చేస్తుందో తెలుసా?
Guppedantha manasu serial mahendra :బుల్లితెర ఆడియన్స్ కి సీరియల్స్ పట్ల మంచి క్రేజ్ ఉంది. ఇక సినిమాలకు ధీటుగా సీరియల్స్ నటీ నటులకు పేరు వస్తోంది. అందుకే ధారావాహికంగా సీరియల్స్ నడుస్తున్నాయి. స్టార్ మా ఛానల్ లో గుప్పెడంత మనసు సీరియల్ ప్రసారమవుతూ ఆడియన్స్ లో మంచి పాపులార్టీ తెచ్చుకుంది.
సీరియల్ మొదలైన కొద్దిరోజులకే టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ సీరియల్ లో నటిస్తున్నవాళ్ళు తమకంటూ ఓ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో హీరో రిషికి తండ్రిగా మహేంద్ర పాత్రలో నటిస్తున్న మంచి గుర్తింపు పొందిన నటుడి అసలు పేరు సాయి కిరణ్. సాయి కిరణ్ 1978మే 8న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు.
ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్న రామకృష్ణ 5వేలకు పైగా పాటలు పాడారు. అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్,అక్కినేని,శోభన్ బాబు వంటి వారితో కల్సి పనిచేసారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రామకృష్ణ కొడుకే సాయి కిరణ్. ఇతడి తల్లి పేరు జ్యోతి. ఈమె కూడా మంచి గాయని. ఈమె దూరదర్శన్ లో పలు సాంగ్స్ పాడి ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందారు.
అయితే సాయికిరణ్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం కావడంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. తరుణ్ హీరోగా నటించిన నువ్వేకావాలి మూవీతో సాయి కిరణ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమించు,డార్లింగ్ డార్లింగ్,తరిగొండ వెంగమాంబ, పెళ్లికోసం, బుల్లబ్బాయి, షిరిడి సాయి,సద్గురు ఆదిశంకర వంటి పలు సినిమాల్లో నటించడమే కాకుండా సింగర్ గా, మెజీషియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇతడికి పెళ్లి అయింది. భార్య పేరు వైష్ణవి. వీరికి ఓ పాప ఉంది. తమిళ,మలయాళ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ తెలుగులో సుడిగుండాలు,శివలీల,అభిలాష,కోయిలమ్మ వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జి తెలుగులో ప్రసారమయ్యే ఇంటిగుట్టు,స్టార్ మాలో గుప్పెడంత మనస్సు సీరియల్స్ లో నటిస్తున్నాడు.