జానకి కలగనలేదు సీరియల్ హీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Janaki Kalaganaledhu Serial Hero Amardeep :టివి సీరియల్స్ కి డిమాండ్ ఉండడమే కాదు, ఇందులో నటించే నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక రెమ్యునరేషన్ కూడా బాగానే అందుతోంది. స్టార్ మా ఛానల్ లో వస్తున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. సిరిసిరి మువ్వలు సీరియల్ లో అశ్విన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న అమర్ దీప్ ఈ సీరియల్ లో హీరోగా చేస్తున్నాడు.
బుల్లితెర సీరియల్స్ లోకి రావడానికి అమర్ దీప్ చాలా కష్టపడ్డాడట. అంతేకాదు, తాజాగా ఓ ఇంటర్యూలో ఒక ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో వెల్లడించాడు. సిరిసిరి మువ్వలు సీరియల్ కి నెలకి 10రోజులు షూటింగ్ ఉండేదట. 10రోజులకు 80వేలు పారితోషికం అందుకున్నాడు.
ఇప్పుడు నటించే జానకి కలగనలేదు సీరియల్ కి ఒకరోజు కోసం 10వేలు అందుకుంటున్నట్లు అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. నెలకు లక్ష రూపాయలు అందుకుంటున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసాడు. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.