Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.
piles home remedies
ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది.
cumin seeds
జీలకర్ర జీర్ణశక్తిని పెంచి గ్యాస్ సమస్యను తగ్గించటమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. జీలకర్రలో ఉండే థైమోల్ గ్రంథులను క్రమబద్దం చేస్తుంది.జీర్ణవ్యవస్థ జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి మూడు నిమిషాలు మరిగించి వడకట్టి తాగాలి.
Piles Fruits
ఈ విధంగా కూడా చేయవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.జీలకర్రను నీళ్లతో గ్రైండ్ చేసి బాగా పేస్ట్ చేసి సమస్య ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.