గుప్పెడంత మనసు హీరో రియల్ లైఫ్…బయట ఎలా ఉంటాడో?
Guppedantha manasu serial Rishi :టివి సీరియల్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టు కుంటోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సీరియల్ లో హీరో రిషి తన పాత్రకు తగ్గట్టు అందంతో అభినయంతో ఆకట్టుకుంటున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జన్మించిన రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. ఇతడి స్టడీస్ మొత్తం మైసూరులోనే పూర్తిచేసాడు. చిన్న నాటినుంచి నటనపై మక్కువ ఉండడంతో స్టడీస్ పూర్తయ్యాక, నాగ కన్యక సీరియల్ ద్వారా కన్నడ బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసాడు.
ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష తో కల్సి కన్నడంలో నాగమండల అనే సీరియల్ లో రిషి నటించాడు. రెండు సీరియల్స్ తోనే కన్నడ బుల్లితెరపై పాపులార్టీ తెచ్చుకున్నాడు. ఇక ఈటీవీలో ప్రేమనగర్ అనే సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. మంచి పేరుతెచ్చుకుని ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.