ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు
కన్నడ భామ రక్షిత ఇడియట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమాతో మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు. పెళ్లి అయ్యిన తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక మళ్ళి తన సెకండ్ ఇన్నింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసింది. తన భర్త ప్రముఖ దర్శకుడు ప్రేమ్. తన భర్త దర్శకత్వంలో తెరకెక్కుతుంది సినిమాకు అమీ జాక్సన్ కు గొంతును అందించారు.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా 2002 లో అప్పు అనే సినిమాలో నటించింది. తెలుగులో స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి తో కలిసి అందరివాడు , నాగార్జునతో కలిసి శివమణి, మహేష్ బాబు తో కలిసి నిజం, శ్రీకాంత్ తో కలిసి పెళ్ళాం ఊరెళ్తే .
2007 లో పెళ్లి అయ్యిన తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. ఈమధ్య టీవీ షోలతో బిజీ గా ఉన్న ఆమె తన భర్త సినిమా కోసం తన గొంతుని రెడీ చేసుకుంటుంది. ఎప్పుడు తన పాత్రకు డబ్బింగ్ చెప్పే ఆమెకు ఇప్పుడు ఇతర పాత్రలకు డబ్బింగ్ చెప్పడం బాగుందని ఆమె స్వయంగా చెప్పారు.