MoviesTollywood news in telugu

రామ్ చరణ్ సినీ ప్రయాణం చిరుత టూ RRR స్పెషల్ ఫోకస్

Ram Charan Movies:తండ్రి మెగాస్టార్,బాబాయ్ పవర్ స్టార్ ప్రోత్సాహంతో రామ్ చరణ్ సినీ ప్రయాణం ప్రారంభం అయింది. మెగా పేరుకు భంగం కలగకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ముందుకు సాగుతున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కెరీర్ 10 సంవత్సరాలలో కేవలం పది సినిమాలను మాత్రమే చేసాడంటే కథల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో అర్ధం చేసుకోవచ్చు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత నుంచి ఇప్పటి రంగస్థలం వరకు రామ్ చరణ్ సినీ ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం.

చిరుత(2007)
2007 లో వచ్చిన చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డాన్స్,ఫైట్స్ తో అదరగొట్టాడు చరణ్.

మగధీర(2009)
రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని రామ్ చరణ్ రెండో సినిమాతోనే సాధించాడు. పైగా డ్యూయల్ రోల్. కాలభైరవ,హర్ష పాత్రలను అద్భుతంగా నటించి హిట్ కొట్టాడు రామ్ చరణ్.
ram charan orange
ఆరెంజ్(2010)
మగధీర హిట్ తో రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. అలాగే రామ్ చరణ్ సినిమాపై అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఆ సమయంలోనే వచ్చిన ఆరెంజ్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు. అయితే నటన పరంగా మంచి మార్కులను కొట్టేసాడు.

రచ్చ(2012)
R.B.చౌదరి నిర్మాణంలో సంపంత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ సినిమాలో రామ్ చరణ్ చాలా జోష్ తో నటించి యువతను ఆకట్టుకున్నాడు.

నాయక్(2013)
V.V.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్. పోషించాడు.

ఎవడు(2014)
రామ్ చరణ్ కి మినిమమ్ గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాలో రెండు పాత్రల షేడ్స్ ని చక్కగా పలికించి హిట్ కొట్టాడు.

గోవిందుడు అందరివాడేలే(2014)
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన పూర్తి స్థాయి కుటుంబ కథ చిత్రం. ఈ సినిమా ఆర్ధికంగా విజయాన్ని అందించకపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది.

బ్రుస్ లీ(2015)
రొటీన్ కథలకు కొంచెం ఫన్ దట్టించి ట్విస్ట్ లతో సినిమా చేసాడు. అయితే ఈ సినిమా ఫలితం మంచి గుణపాఠాన్ని నేర్పింది రామ్ చరణ్ కి.

ధ్రువ(2016)
మంచి హిట్ కోసం చూస్తున్న రామ్ చరణ్ కి ఈ సినిమా హిట్ ని అందించింది. అలాగే ఈ సినిమా కోసం తన లుక్స్ ని బాగా మార్చుకున్నాడు.
rangasthalam movie
రంగస్థలం(2018)
ప్రయోగాలు మిశ్రమ ఫలితాలను అందించిన భయపడకుండా ఈ సారి కూడా ప్రయోగం చేసారు. స్టార్ హీరో అయ్యిండి చెవిటి వాడిగా నటించాడు రామ్ చరణ్. డీ గ్లామర్ గా నటించటానికి సై అన్నాడు. మార్చి 30 న విడుదల అయిన రంగస్థలం సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు రామ్ చరణ్.
RRR Movie naatu naatu song
ఆ తర్వాత వినయ విదేయ రామ, ఆచార్య నిరసపరచిన…RRR సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.