నిమ్మకాయను కట్ చేసి ఉప్పు వేసి వంటగదిలో పెడితే ఏమి జరుగుతుందో తెలుసా?
Lemon Tips In telugu : సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. నిమ్మకాయతో పిండివంటలు మరియు డ్రింక్స్ తయారు చేసుకుంటారు. నిమ్మ కాయలో ఎన్నో పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు. ఆరోగ్య పరంగా,చర్మ సంరక్షణ,జుట్టు సంరక్షణ ఇలా అన్ని విధాలా సహాయపడుతుంది.
నిమ్మకాయలో ఉన్న ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాల గురించి మనకు తెలిసిన విషయమే. అయితే నిమ్మకాయతో ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. నిమ్మకాయ వంటగదిలో వచ్చే వాసనలను వదిలించు కోవడానికి సహాయపడతాయి. జెర్మ్స్ మరియు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా నిమ్మకాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
అయితే నిమ్మకాయతో వంటగదిలో వాసనలను ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం.ముందుగా నిమ్మకాయను ఫోటోలో ఉన్న విధంగా కట్ చేసి మధ్యలో ఉప్పు జల్లాలి. ఉప్పు వేసిన నిమ్మకాయను వంటగదిలో పెడితే నిమ్మకాయ ఆ ప్రాంతంలో దాని వాసనను వ్యాప్తి చేయడం ప్రారంభించి బ్యాక్టీరియా మరియు సూక్ష్మక్రిములను నాశనం చేయడం ద్వారా దుర్వాసనను తొల గిస్తుంది.నిమ్మకాయ విటమిన్స్ మరియు ఆమ్లత్వం కలిగి ఉంటుంది.
ఉప్పు వేసిన నిమ్మకాయను రాత్రి నిద్ర పోతున్నప్పుడు దగ్గరలో టేబుల్ మీద పెట్టుకుంటే ఫ్రెష్ గాలి వస్తుంది. గాలిలోని విషాలను గ్రహిస్తుంది. మూడ్ బాగుండేలా చేస్తుంది. జలుబుగా ఉన్నప్పుడు ఉప్పు వేసిన నిమ్మకాయను రాత్రి సమయంలో మీ తల దగ్గర ఉంచడం వల్ల మీ సైనసెస్ మరియు గొంతు సమస్యలు,జలుబు అన్ని తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.