పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుంది
Tollywood Heroine kamna jetmalani :పెళ్లయిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లో నటించరు. బాలీవుడ్లో అయితే ఇలాంటి పట్టింపులేవి అక్కడ ఉండవు . కానీ ఈ మధ్య టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ నడుస్తుంది.తెలుగులో లో గోపీచంద్ నటించిన రణం సినిమాతో పరిచయమైంది కామ్న టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా అనుకున్న గుర్తింపు రాలేదు.
చిన్న సినిమాలు, ఐటమ్ సాంగ్స్ కే పరిమితమైంది ఈ అమ్మాయి. ప్రముఖ న్యాయ వాది రామ్ జెఠ్మలానీ మనవరాలు, ఈ విషయం చాలా మందికి తెలియదు. కామ్నపెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు కామ్నా జఠ్మలానీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ చివరిగా 2022లో కన్నడ భాషలో గరుడ అనే మూవీ చేసింది. కెరీర్ డౌన్ అవుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుని సినిమాలకు బై బై చెప్పేసింది.. అంతే కాదు వెంటనే ఇద్దరు పిల్లల్ని కూడా కనేసింది. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ ఉండిపోయింది.