Beauty TipsHealth

కాటుక ఆకు గురించి మీకు తెలుసా…ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…?

Gunta galagara plant Benefits In telugu : కాటుక ఆకు అంటే గుంటగలగరాకు. ఈ ఆకు పల్లెటూర్లో ఉండే వారికి సుపరిచితమే. వర్షాకాలం వచ్చినప్పుడు నీరు ఎక్కువగా ఉండే ప్రదేశంలోనూ పంట పొలాల గట్లపై ఎక్కువగా ఈ మొక్క కనబడుతూ ఉంటుంది ఈ మొక్క ఆకులు పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆకుతో తయారు చేసిన నూనెను మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. మనం ఇంటిలో కూడా ఈ నూనె తయారు చేసుకోవచ్చు. కొబ్బరినూనెలో ఈ ఆకులను వేసి బాగా మరిగించి ప్రతిరోజు రాసుకోవచ్చు. ప్రతిరోజు ఈ నూనెను రాసుకోవడం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
hair fall tips in telugu
అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. ఈ ఆకులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేస్తుంది. యాంటీ మైక్రోబయల్,యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు తగ్గించడంలో సహాయపడుతుంది. తెల్లజుట్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ నూనెను ప్రతి రోజూ రాస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
White Hair Tips
కాబట్టి ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. వీలైతే మీ ఇంటిలో ఈ మొక్కను పెంచుకోండి. ఈ మొక్క జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఇటువంటి మొక్కలు కనిపించినప్పుడు అశ్రద్ద చేయకుండా వాడటానికి ప్రయత్నించండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.