చిన్నప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?
Tollywood Heroine Tamanna : తెలుగులో ప్రముఖ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించిన టువంటి “శ్రీ” అనే చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
దాంతో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “హ్యాపీడేస్” అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో ప్రస్తుతం వరుస స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.అయితే ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నాకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫోటోలు తమన్నా చిన్నప్పటి ఫోటోలు కావడంతో తమన్నా చిన్నప్పుడుచాలా క్యూట్ గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అంతేగాక తమన్నా అభిమానులుఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉంది.