MoviesTollywood news in telugu

చిరంజీవి విజయం వెనుక సురేఖ పాత్ర ….నమ్మలేని నిజాలు

Chiranjeevi and surekha facts :స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కి టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఉన్న మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలనుంచి బ్యాక్ టు బాస్ అంటూ ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆరుపదుల వయస్సులోనూ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. ఎవరి విజయం వెనుక చూసినా ఎవరో ఒకరు ప్రధాన కారకులు ఉంటారు. ముఖ్యంగా భార్య పేరే చెబుతారు.
chiranjeevi
ఇక చిరు విషయంలో కూడా ఆయన భార్య సురేఖ ఉన్నారని చెప్పక తప్పదు. మెగాస్టార్ కూడా ఈ విషయం ఎన్నో సార్లు చెప్పారు కూడా. అయితే టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత అల్లూరి రామలింగయ్య కూతురైన సురేఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి స్వయానా సోదరి. హైదరాబాద్ ప్రముఖ కాలేజీలో డిగ్రీ వరకు చదివి, ఆ తరువాత చిరంజీవితో పెళ్లి కావడంతో చదువులను ఆపేసి కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించారు.

ఈమె పెళ్లయ్యేసరికి చిరంజీవి కుటుంబం పెద్దదిగా ఉండేది. ఇందులో ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు ఆడ పడుచులతో ఇల్లు ఎప్పుడూ సందడిగా పరుచుకునేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిగా ఉండడంతో సురేఖ తన సొంత కొడుకులా చూసుకున్నారు. అందుకే వదినను అమ్మతో సమానంగా పవన్ భావిస్తాడు. ఫ్యామిలీలో ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా సురేఖ చూసుకోవడం వల్లనే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ బాధ్యతలను సురేఖ నెత్తిన పెట్టి సినిమాలపై దృష్టి సారించి మెగాస్టార్ గా ఎదిగాడు.

నిజ జీవితంలో కూడా చాలా సింపుల్ గా ఉండే సురేఖ.. ఎలాంటి ఆడియో ఫంక్షన్లకు, సినిమా ఈవెంట్లకు ఎప్పుడూ రాలేదు.భర్త చిరు సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకెళ్తుంటే, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, నిర్మాతగా బిజీగా ఉన్నాడు.