Healthhealth tips in telugu

ఒకే ఒక్క ఆకు నోట్లో వేసుకుంటే చాలు దగ్గు,జలుబు,గొంతునొప్పి అన్ని మాయం

cold and cough home-remedies :ఈ చలి కాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి వచ్చాయంటే ఒక్క పట్టానా తగ్గవు. అయితే సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే ఆకు తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. అదే వాము ఆకు. ఈ ఆకును అనేక రకాల మందులలో వాడతారు. వాము చెట్టు ఇంట్లో సులభంగా పెరుగుతుంది.
vamaku beenfits
దగ్గు, జలుబు ఉన్నప్పుడు రోజులో రెండు సార్లు వాము ఆకును తినవచ్చు. లేదా వాము ఆకు నుండి రసాన్ని తీసి దానిలో తేనె కలిపి తీసుకోవచ్చు. తీవ్రతను బట్టి రోజులో 2 సార్లు తీసుకోవచ్చు. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.
Honey benefits in telugu
ఈ ఆకుల పొగను పిలిస్తే శ్వాస నాళాలు ఫ్రీ అయ్యి శ్వాస బాగా ఆడుతుంది. ఈ చలికాలంలో ఉబ్బసం ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు.
ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. దగ్గును తగ్గించటమే కాకుండా ఈ ఆకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు,జలుబు వంటివి వస్తే చాలా చికాకుగా ఉంటుంది.

వీటిని చాలా తొందరగా తగ్గించుకోవాలి. అప్పుడే ప్రశాంతగా ఉంటుంది. వాము ఆకుతో బజ్జీలు,పకోడీ, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. వాము ఆకు మొక్కలో ప్రతి బాగంలోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొక్కను ఇంటిలో పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.