ఎప్పుడు పుస్తకాలు చదివే పవన్ ఏ క్లాస్ వరకు చదివాడో తెలిస్తే షాక్ అవుతారు
Pawan Kalyan Education:చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అంటారు.. నిజమే బాగా చదువుకున్న వారు కూడా సినిమాల్లో ఉన్నారు. రాఘవేంద్రరావు బీ.ఏ అంటే అప్పట్లో గొప్ప.. కానీ ఇప్పుడు బీ.ఏ అంటే.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు.. అదే సమయంలో ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందుతున్న వారున్నారు.కళకు చదువు అడ్డు రాదని నిరూపించాడు పవన్ కళ్యాణ్..
తెలుగు హీరోల్లో చాలా మంది అమెరికా, ఇండియాలో ఎంఎస్, ఎంఫిల్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి గొప్ప గొప్ప చదువులు చదివారు.అయినా సినిమాల్లో ఎదురీదుతున్న వారున్నారు. కానీ పెద్దగా చదవకుండా మన పవన్ కళ్యాన్ అభిమానుల్లో గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైంది.?
కొణిదెల కల్యాన్ బాబు అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.. అదే పవన్ కళ్యాన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. కానీ పవన్ పదో తరగతి సర్టిఫికెట్ లో కల్యాన్ బాబు అనేపేరే ఉంది. పవన్ సినిమాల్లోకి ఆశ్చర్యకరంగా వచ్చాడు. పెద్దగా బయట కలవని.. సిగ్గరి అయిన పవన్ సినిమాల్లో రాణిస్తాడో లేడో అన్న సందేహం చిరంజీవికి ఉండేదట.. అటు చదువుల్లో పాస్ కాకపోవడంతోనే పవన్ ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు చిరంజీవి..
పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజనాదేవిలకు 1972 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు.. ఇద్దరు అన్నయ్యలు.. తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న శివశంకర వర ప్రసాద్ అదే చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య.. నటుడు, నిర్మాత నాగబాబు పవన్ కు రెండో అన్నయ్య.
పవన్ కళ్యాన్ నాన్న పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తుండేవాడు. దీంతో తరచూ బదిలీలు జరిగేవి. ఇలా పవన్ విద్యాభాస్యం బాపట్లలో మొదలైంది. తర్వాత చీరాలలో కొనసాగింది. పవన్ తన ఇంటర్ మీడియట్ ను నెల్లూరులోని వీ.ఆర్.సీ కళాశాలలో పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువుల మీద ఆసక్తి లేక డిగ్రీ చేయలేదు. అనంతరం కంప్యూటర్స్ లో డిప్లొమో చేసి చదువులకు శాశ్వతంగా స్వస్తి పలికాడు.
ఖాళీగా ఉన్న పవన్ అటు చదువుకోకుండా ఇటు ఎవ్వరితో కలువకుండా సైలెంట్ గా ఉండడం చూసి చిరంజీవి 1996లో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయించాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా తీస్తూ అంచలంచెలుగా ఎదిగిన పవన్ ఇప్పుడు పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.. ఇంటర్మీడియెట్ వరకే చదువు ఆపేసిన పవన్ ఇంత స్టార్ గా ఎదిగాడంటే ఇప్పటికీ అందరూ నమ్మలేకుండా ఉన్నారు.