Healthhealth tips in telugu

ప్రతి రోజు రాత్రి సమయంలో అరటి పండు తింటే…ముఖ్యంగా ఈ సీజన్ లో…ఏమి అవుతుందో…?

Eating bananas during monsoon is good or bad : అరటి పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటి పండును చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ సీజన్ లో అరటి పండు తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. అరటి పండు సంవత్సరం పొడవునా సులభంగా మరియు చాలా చవకగా లభ్యం అవుతుంది.

ఈ సీజన్ లో అరటి పండు తినే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. అరటి పండు తినే సమయాన్ని బట్టి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చల్లని వాతావరణంలో తింటే కొన్ని సార్లు జలుబు మరియు కఫం వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లను ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.
banana benefits in telugu
కానీ అరటిపండ్లను సాయంత్రం, రాత్రి లేదా ఖాళీ కడుపుతో తింటే…అలాగే కొన్ని ఆహారాలతో కలిపి తింటే ఆరోగ్యానికి కొంత హాని కలిగే అవకాశం ఉంది. అజీర్ణం, దగ్గు లేదా శ్వాస కోశ సమస్యలు ఉన్నప్పుడు రాత్రిపూట అరటిపండ్లు తినకూడదు. అలా తింటే కఫాన్ని పెంచి శరీరంలో శ్లేష్మం పేరుకుపోతుంది. అలాగే మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
Banana,Peel
అందువల్ల, అరటిపండ్లను రాత్రిపూట కాకుండా పగటిపూట తినడం మంచిది. పగటి పూట తింటే ఈ పండులోని ప్రోటీన్ మరియు ఫైబర్ జీర్ణం కావడానికి శరీరానికి తగినంత సమయం లభిస్తుంది. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. అంతేకాక విటమిన్ సి ఉండటం వల్ల హైపర్ యాసిడిటీకి దారి తీస్తుంది.

అలాగే, ఈ పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులతో బాధపడేవారికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందువల్ల, అరటిపండ్లు తినడానికి అల్పాహారం లేదా మధ్యాహ్న భోజన సమయం అనేవి ఉత్తమ సమయాలుగా చెప్పవచ్చు. అరటి పండులో అమైనో ఆమ్లాలు, విటమిన్-బి6, సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ సమృద్దిగా ఉంటాయి.
Immunity foods
అందువల్ల ఈ పండును రోజూ తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, గుండెను బలపరుస్తుంది మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో అరటిపండును పాలు లేదా పాల ఉత్పత్తులతో తీసుకోవడం హానికరం. ఈ రెండూ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. అజీర్ణం మరియు గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.