చిరుతో స్టెప్స్ వేసిన ఈ భామను గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో నమ్మలేని నిజం
Tollywood Heroine Vani Viswanath :ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన వాణీ విశ్వనాధ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షుకులు ఉండకపోవచ్చు. 1990వ దశకంలో పలు హిట్ చిత్రాల్లో నటించి తానేమిటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. చూడ చక్కని రూపం,మంచి అభినయంతో ఆకట్టుకునే ఈమె దాదాపు అన్ని భాషల్లో అందునా, అగ్ర హీరోలందరి సరసన నటించింది.
ఇక ఆరోజుల్లో వాణీ ఉంటే చాలు మినిమమ్ గ్యారంటీ అనుకునేవాళ్లు ఫిలిం మేకర్స్, అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో కమర్షియల్ మూవీసే కాకుండా కుటంబ కథా చిత్రాల్లో కూడా నటించి మెప్పించి, మార్కెట్ లో ఆమె క్రేజ్ పెంచుకుంది. నిజానికి కేరళ కుట్టి అయిన వాణీ, తల్లిదండ్రలు చెన్నైలో సెటిల్ అవ్వడంతో స్టడీ అంతా అక్కడే సాగింది.
వాణీ తండ్రి తాళత్తు విట్టల్ విశ్వనాథన్ పాపులర్ జ్యోతిష్యుడు. తల్లి గిరిజ సాధారణ గృహిణి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. అందులో
నాలగవ సంతానం అయిన వాణీ 1971 మే13న కేరళలో జన్మించింది.. తాళత్తు విట్టల్ విశ్వనాథన్ ఎంత పాపులర్ అంటే సినిమా వాళ్ళందరూ నిర్మాతలందరూ ఈయన దగ్గరకే వచ్చి, ఓపినింగ్ నుంచి రిలీజ్ దాకా ముహుర్తాలు ఈయన దగ్గరే పెట్టించుకునేవారు.
తమిళ స్టార్స్ ఎంజీఆర్,శివాజీ గణేశన్ , తెలుగులో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ వంటి వాళ్లంతా ఈయన దగ్గరకే వెళ్లేవారు. ఇక శోభన్ బాబుకి ఆయన గురువుతో సమానం అనేవారు. ఇక వాణీకి 13ఏళ్ళు రాగానే పెద్ద స్టార్ అవుతావని గవ్వలు వేసి, ముందుగానే తండ్రి ఊహించి చేశారట. ఆయన చెప్పినట్టు వాణీ నటిగా మారడమే కాకుండా అన్ని దక్షిణాది భాషల్లో పేరు తెచ్చుకుంది.
ఇక తండ్రి జాతకం ప్రకారం,సినిమా రంగ ప్రవేశం చేస్తూ, 1982లో మాంగళ్య ఛాత్తు అనే మలయాళ మూవీ ద్వారా తెరంగేట్రం చేసిన వాణీ,ఆతర్వాత అనేక తెలుగు, తమిళ,,కన్నడ, భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల నుంచి రివార్డులు అందుకుంది. తెలుగులో అలెగ్జండర్ మూవీతో పేరుతెచ్చుకున్న వాణీ, చిరంజీవితో ఘరానా మొగుడు చిత్రంలో నటించడంతో, కమర్షియల్ గా బ్రేక్ వచ్చింది.
ఆతర్వాత అనేక కుటుంబ కథాచిత్రాల్లో నటించి పేరుతెచ్చుకుంది. నిజానికి వాణీ సినిమాల్లోకి రాకమునుపు హార్స్ రైడింగ్ ని వృత్తిగా ఎంచుకుని, పలు పోటీల్లో పాల్గొని విన్నర్ గా నిల్చింది. ఇక టీనేజ్ లోనే బులెట్ బైక్ రేస్ లో పాల్గొని అబ్బాయిలను సైతం ఓడించిన ఘటనలు ఎన్నో వున్నాయి. ఇక మలయాళ సినిమాల్లో విలన్ వేస్తూ,ఆతర్వాత కమెడియన్ గా మారిన బాబు రాజ్ తో పలు చిత్రాల్లో నటించిన వాణీ చివరకు అతనితో ప్రేమలో పడింది.
దీంతో 2002లో మ్యారేజ్ చేసుకున్న వీరికి అర్చా, అద్రి అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇంటికే పరిమితం అయిన వాణీ దృష్టి ప్రస్తుతం రాజకీయాలపై పడింది. అన్నీ అనుకూలిస్తే,వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేయాలని భావిస్తోంది. చూద్దాం రాజకీయాల్లో కూడా రాణిస్తోందేమో..