డయాబెటిస్ ఉన్నవారు గుమ్మడికాయ తింటే ఏమి అవుతుందో తెలుసా?
Pumpkin as a super food for diabetics : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. అలా మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు గుమ్మడికాయ తింటే ఏమి అవుతుందో చూద్దాం.
సాదరణంగా డయాబెటిస్ ఉన్నవారిలో దృష్టి లోపం, చర్మ వ్యాధులు, నరాల దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. గుమ్మడికాయలో పాలిసాకరైడ్లు, ఖనిజాలు, కెరోటిన్, విటమిన్లతోపాటుగా ఎన్నో పోషకాలు ఉంటాయి.
ముఖ్యంగా గుమ్మడికాయలో ఉండే పాలీశాకరైడ్స్ అని పిలువబడే కార్బోహైడ్రేట్లు మరియు ప్యూరరిన్ అనే సమ్మేళనం ఉండుట వలన రక్తంలో గ్లోకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తాయి. గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇన్సులిన్ ను ఉత్తేజపరచడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అయితే గుమ్మడికాయను ఎక్కువగా తింటే డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కాదు.
ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. గుమ్మడికాయ గ్లైసెమిక్ ఇండెక్స్‌లో 75 వద్ద అధిక స్థానంలో ఉంది, కానీ గ్లైసెమిక్ లోడ్‌లో 3 వద్ద తక్కువగా ఉంది. అధిక GI కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదని భావిస్తారు. కానీ గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగవని నిపుణులు చెప్పుతున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.