1 గ్లాసు ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
weight Loss Drink : అధిక బరువు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అధిక బరువు,శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి మార్కెట్ లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులతో అధిక బరువును, శరీరంలో కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో రెండు బిరియాని ఆకులు,రెండు యాలకులు కచ్చా పచ్చాగా దంచి వేయాలి. ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్క,అరస్పూన్ జీలకర్ర వేసి 7 నుంచి 8 నిమిషాలు మరిగించి ఆ నీటిని గ్లాసు లోకి వడకట్టాలి. వడకట్టిన తర్వాత బిరియాని ఆకు మిశ్రమాన్ని పాడేయవలసిన అవసరం లేదు.
దీనిలో కొంచెం పెరుగు కలిపి మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాస్తే ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఇక ఈ డ్రింక్ ని రోజుకి ఒకసారి చొప్పున 15 రోజుల పాటు తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. గ్యాస్ సమస్య లేని వారు ఉదయం పరగడుపున తాగాలి.
గ్యాస్ సమస్య ఉన్న వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి. ఈ డ్రింక్ లో ఉపయోగించిన జీలకర్ర బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క కొవ్వు కణాల సంఖ్యను తగ్గిస్తుంది. బిరియాని ఆకు కూడా కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.